![]() |
![]() |

'సల్మాన్ ఖాన్'(Salman Khan)గత కొంత కాలంగా వరుస పరాజయాల్ని చవిచూస్తున్నాడు. 'ఈద్'(Eid)పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 28 న 'సికందర్'(Sikandar)తో వచ్చి మరో ప్లాప్ ని మూటగట్టుకున్న సల్మాన్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'(Battle of Galwan)అనే మూవీ చేస్తున్నాడు. 2020 జూన్ నెలలో లద్ధాక్ తూర్పు సరిహద్దుల్లోని గల్వన్ లోయలో చైనా సైనికులు, మన సైనికులు మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. దీంతో మన సైనికులు ఇరవై మంది దాకా చనిపోవడం జరిగింది. ఈ పాయింట్ ఆధారంగానే 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' తెరకెక్కుతుంది.
రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతు 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ షూటింగ్ ని మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. చాలా కష్టతరమైన లొకేషన్స్ లో షూటింగ్ ని జరపబోతున్నాం. అందులో భాగంగా 'లద్ధాక్' లోని గడ్డ కట్టే చలిలో ఎనిమిది రోజుల పాటు షూటింగ్ కి రెడీ అవుతున్నాం. ఈ విషయం తలుచుకుంటేనే చాలా భయంగా ఉన్నా కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
సల్మాన్ ఈ మూవీలో ఆర్మీ అధికారిగా చేస్తుండగా, చిత్రాంగద హీరోయిన్ చేస్తుంది. మిగతా నటి నటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అపూర్వ లఖియా(Apoorva Lakhia)దర్శకుడు కాగా వ్యవహరిస్తుండగా, ఇప్పటికే రిలీజైన మోషన్ పోస్టర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో దేశభక్తిని నింపుతుంది. సల్మాన్ ఖాన్ నే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.

![]() |
![]() |